మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
హుజూర్‌నగర్: మహిళలు వంట గదికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో ముందుండాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సంక్రాంతి సందర్భంగా బుధవారం హుజూర్‌నగర్‌లో సీపీఎం ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ప్రారంభించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం శక్తితో నిలబడాలని ఆకాంక్షించారు. తమ సమస్యలపై మహిళలు పోరాటాలకు సిద్ధంకావాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి పల్లె వెంకట్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, వటె్‌ుట్ప సైదులు, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.వెంకటచంద్ర, ఎం.జ్యోతి, కౌన్సిలర్ త్రివేణి, పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment