క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
చివ్వెంల(సూర్యాపేట) : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, మొదటి అదనపు జూనియర్ సీవిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment