భానుపురి (సూర్యాపేట): ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ నిర్వహించనున్నారు. సర్వే చేసిన దరఖాస్తుల్లో ఐదు శాతం ఇళ్లను పునః పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసుకున్న దరఖాస్తులపై సర్వే నిర్వహించింది. దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించడానికి 2024 డిసెంబర్ 10 నుంచి సర్వే ప్రారంభించింది. యాప్‌లో ప్రజాపాలన దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేశారా..? లేక తప్పుడు సమాచారం నమోదు చేశారా..? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో త్వరలో మళ్లీ పరిశీలించనున్నారు.
95 శాతం సర్వే పూర్తి..
ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. జిల్లాలో మొత్తం 3,09,062 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. చాలామంది ఇళ్లు ఉన్నప్పటికీ లేనట్లుగా దరఖాస్తు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ మేరకు అధికారులు యాప్‌లో వివరాలతో పాటు మూడురకాల ఫొటోలను అప్‌లోడ్ చేసే సమయంలో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తికాగా.. సర్వేను అధికారులు నిలిపివేశారు. మిగతా వారంతా బతుకుదెరువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లడం, కుటుంబ సభ్యులు ఉన్నా దరఖాస్తు చేసినవారు చనిపోవడం, ఒక ప్రాంతంలో అద్దెకు ఉండి సర్వే సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఉన్నారు. ఇలాంటి వారి జాబితాను సిబ్బంది ప్రత్యేకంగా రూపొందించి అధికారులకు సమర్పించారు.
ఐదు శాతం దరఖాస్తులతో..
జిల్లాలో సర్వే పూర్తయిన వాటిలో ఐదు శాతం దరఖాస్తులతో అధికార యంత్రాంగం మరోసారి సర్వే చేయనున్నారు. సర్వే సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సమగ్రంగా వివరాలు నమోదు చేశారా..? వారు నమోదు చేసిన వివరాలతో సరిపోల్చనున్నారు. త్వరలోనే గృహనిర్మాణ శాఖ అధికారులతోపాటు పీడీలు, పురపాలక సంఘాల్లో కమిషనర్లు, గ్రామాల్లో ఎంపీడీఓలు వెళ్లి యాప్‌లో నమోదు చేసిన వివరాలు సరి చూడనున్నారు. ఈ సర్వే పూర్తయిన అనంతరం గ్రామసభలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపికలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ప్రధాన భూమిక పోషించనున్నట్లు తెలుస్తోంది. గ్రామసభల్లో ఎంపికై న అర్హుల జాబితాను కలెక్టర్‌కు పంపి..అక్కడి నుంచి ప్రభుత్వ ఆమోదంతో జాబితాను విడుదల చేయనున్నారు.
ఫ ఇందిరమ్మ సర్వే తీరుపై ఆరా
ఫ ఐదు శాతం దరఖాస్తులను
పునః పరిశీలించనున్న అధికారులు
ఫ త్వరలో ప్రారంభం కానున్న ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment