క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : పథకాల లబ్ధిదారుల ఎంపికకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి వెబ్‌ఎక్స్ ద్వారా అధిరారులతో మాట్లాడారు. ఈనెల 26న ప్రభుత్వం అమలులోకి తెస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి పరిశీలన చేసి జాబితా తయారు చేయాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంపీడీఓలకు లా గిన్ లో లబ్ధిదారుల వివరాలు పంపామని వారి బ్యాంకు అకౌంటు వివరాలు పరిశీలించి అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, జిల్లా మైనార్టీ అధికారి జగదీష్ రెడ్డి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment