నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో వారి సర్వీస్‌ను బ్రేక్ చేసూ్‌త్ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనిచేసే 99 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రెండు నెలల నుంచి 11 నెలల పాటు (ఒక్కొక్కరు ఒక్కో రకంగా) విధులకు గైర్హాజరయ్యారు. గత నెలలో వారంతా విధుల్లో చేరేందుకు కలెక్టర్‌ను సంప్రదించగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.
అనుమతి లేకుండా గైర్హాజరు
గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు లేరు. కార్యదర్శులూ లేకపోతే గ్రామ పాలన ఆగిపోయే పరిస్థితి నెలకొంది. గ్రూపు–1, గ్రూపు–2కు ప్రిపేర్ అయ్యేందుకు చాలా మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు కొన్ని నెలలుగా గైర్హాజరయ్యారు. వాస్తవానికి వారు ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకొని, సెలవు పెట్టాలి. కానీ, వారు సెలవు పెడుతున్నట్లు ఒక పేపరుపై రాసి కార్యాలయంలో ఇచ్చి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ 99మంది విధుల్లో చేరేందుకు వచ్చారు. గైర్హాజరు కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకొని వారు విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు ఇస్తూ ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. సర్వీస్ బ్రేక్ చేయడంతోభవిష్యత్‌లో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల తదితర వాటిల్లో నష్టం జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment