తిరుమలగిరి (తుంగతుర్తి): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులను ప్రకటించింది. బ్యాలెట్ ముద్రణకు జిల్లా స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి 50 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికలపై గ్రామాల్లో ఆసక్తి నెలకొంది.
గుర్తులు ఇవీ..
సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, ఫుట్ బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్టు, పాన్, చెక్క డబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతి కర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాట్రినైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలి బుడగ వంటి గుర్తులు ఉన్నాయి. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, గరాట, మూకుడు, డిష్ యాంటీనా, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, బూస్టు డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ స్టిక్, కర్ర బంతి, నైక్ టై, విద్యుత్ స్తంభం, షటిల్ వంటి గుర్తులు కేటాయించారు.
ఆశావహుల్లో ఉత్కంఠ
జిల్లాలో 475 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఆశావహులు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల నాటి రిజర్వేషన్లే రెండుసార్లు వర్తిస్తాయని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేడు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయించింది. దీనిని బట్టి పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు మారనున్నట్లు స్పష్టమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కుల గణన ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రిజర్వేషన్ల ప్రకటన తరువాతనే నోటిఫికేషన్ రానుంది. రిజర్వేషన్లు ఎలా ఉండనున్నా యోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఫ సర్పంచ్‌లకు గులాబీ రంగు,
వార్డు సభ్యుడికి తెలుపు రంగు బ్యాలెట్
Comments
Please login to add a commentAdd a comment