పెద్దగట్టు ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం
చివ్వెంల(సూర్యాపేట) : దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) ఆలయ కమిటీ గురువారం ప్రమాణస్వీకారం చేసింది. ఆలయ కమిటీ చైర్మన్, సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది పోలేబోయిన నర్సయ్య, డైరెక్టర్లు పోలేబోయిన నరేష్ పిళ్లే, కుర్ర సైదులు, వీరబోయిన సైదులు, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, సిరపంగి సైదమ్మ చేత దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి, ఈఓ కుశలయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగట్టులో శాశ్వత పనులకు ప్రస్తుత ప్రభుత్వంలో నిధులు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జాతరకు ఆహ్వానిస్తామని తెలిపారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, ఎలిమినేటి అభినయ్, అంజద్ అలీ, ధరావతు వీరన్న నాయక్, చింతమళ్ల రమేష్, యల్కపల్లి వెంకన్న, కొండ వెంకన్న , వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, మెంతబోయిన బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment