స్కాన్ చేయి.. మార్కులు వేసెయ్!
తిరుమలగిరి (తుంగతుర్తి): విధుల్లో పారదర్శకత, పోలీసుల వ్యవహార శైలి, వారు అందించే సేవలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేలా పోలీస్ శాఖ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే అర్జీదారుల నుంచి రక్షకభటుల పనితీరును డిజిటిల్ విధానంలో తెలుసుకునే క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పోలీసులకు ర్యాంకులు రానున్నాయి. ఇది నేరుగా రాష్ట్ర పోలీస్ శాఖ కార్యాలయానికి అనుసంధానంగా ఉండడంతో ఏ పోలీస్ స్టేషన్‌లో ప్రజలకు ఎలాంటి మర్యాద లభిస్తుందనేది అధికారులు గమనిస్తుంటారు. తద్వారా పోలీసుల పనితీరుపై లోపాలు ఉంటే మార్చుకునేలా దిశానిర్దేశం చేయడం, మార్పు రాకుంటే శాఖాపరంగా చర్యలు తీసుకుంటారు. ప్రతి స్టేషన్‌తో పాటు సర్కిల్, డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల్లో ఐదు చొప్పున వీటిని ఏర్పాటు చేశారు.
అభిప్రాయాలు తెలిపేది ఇలా..
పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారు అక్కడి క్యూఆర్ కోడ్‌పై సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. స్కాన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కాన్ చేయగానే మొదట ఫోన్‌లో తెలుగు, ఇంగ్లిష్‌తో ఓ పేజీ తెరుచుకుంటుంది. భాషను ఎంచుకున్నాక పేరు, జెండర్, సెల్‌ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పోలీస్ స్టేషన్ పేరు ఇలా వివరాలు భర్తీ చేయాలి. అందులోనే తమ అభిప్రాయాలు తెలిపేందుకు ఒక బాక్సు ఉంటుంది. దానిలో పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీస్ స్టేషన్‌లో ఎదురైన అనుభవాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ఫోన్‌లో స్వైప్ చేయడం తెలియని, సాధ్యం కానివారు వాయిస్ రూపంలోనూ, అభిప్రాయాలు తెలిపే వీలు కల్పించారు. ఇలాంటి వారికి ఆటోమేటిక్ కాలింగ్ యాప్ ద్వారా కోడ్ చేసి అభిప్రాయాలను సేకరిస్తారు. అది నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుతుంది. దీనిని ఉన్నతాధికారులు మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. సదరు పోలీసులు చూసే వీలుండదు. దీంతో ఎవరు ఎలాంటి అభిప్రాయాలను నమోదు చేశారన్నది బయట తెలిసే అవకాశం లేక పోవడంతో అర్జీదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఈ–చాలాన్, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఇతర అంశాలకు సంబంధించి అభిప్రాయాలకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి రూపొందించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్, క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఈనెల 9న ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు.
పోలీసుల పనితీరుపై అభిప్రాయం తెలపండి
పోలీసుల పనితీరు, వారి పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేశాం. ఎవరైనా సరే ట్యాగ్ చేసి అభిప్రాయాలు తెలుపువచ్చు. పోలీసుల పనితీరుపై రేటింగ్ ఇవ్వవచ్చు.
– సన్‌ప్రీత్ సింగ్, ఎస్పీ, సూర్యాపేట
ఫ పోలీసుల సేవలు, పనితీరుపై
ప్రజాభిప్రాయ సేకరణ
ఫ ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్యూఆర్ కోడ్
అందుబాటులోకి
ఫ కొత్త విధానానికి శ్రీకారం
చుట్టిన పోలీస్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment