కోర్కెలు తీర్చే తల్లి.. మరియమాత
రామగిరి(నల్లగొండ): భక్తుల కోర్కెలు తీర్చే తల్లి మరియమాత అని బిషప్ కరణం ధమన్‌కుమార్ అన్నారు. నల్లగొండలోని మరియగిరిపై మరియమాత మహోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ దివ్య పూజాబలిని నిర్వహించి మాట్లాడారు. సమస్త మానవాళికి ఏసు ప్రభువును అందించిన గొప్ప తల్లి మరియమాత అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మరియగిరి డైరెక్టర్ రెవరెండ్ తుమ్మ జోసెఫ్‌రెడ్డి, ఫాదర్ జగదీష్, ఫాదర్ ఆర్లారెడ్డి, డాన్‌బోస్కో ప్రిన్సిపాల్ బాలశౌరిరెడ్డి, సెయింట్ ఆల్ఫోన్సెస్ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ హృదయ్‌కుమార్‌రెడ్డి, మాంట్‌ఫోర్ట్ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ బాలఇన్నా, చర్చి కౌన్సిల్ మెంబర్స్ పసల శౌరయ్య, మర్రెడ్డి, నామ మారయ్య, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బిషప్ కరణం ధమన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment