సాగు చేయని భూములను గుర్తించాలి
భానుపురి (సూర్యాపేట): సాగు చేయని భూములను క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించి ఆయా భూముల రైతులను రైతు భరోసా పథకానికి అనర్హులుగా ప్రకటించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. గురువారం నుంచి గ్రామాల వారీగా చేపట్టే క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను బుధవారం ఆయన సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ జనవరి 16వ తేదీ నుంచి 20 వరకు గ్రామాల వారీగా సర్వే నంబర్ ప్రకారం సాగు చేయని భూములను గుర్తించాలన్నారు. సాగు చేయని భూముల్లో రాళ్లు, గుట్టల వివరాలను సర్వేయర్ ద్వారా సేకరించాలన్నారు. పట్టణంలోని లేఅవుట్లు, నాలాగా మార్చిన భూములు, పరిశ్రమలకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్ ద్వారా సేకరించాలని సూచించారు. సాగు చేయని భూముల వివరాలను జనవరి 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో తెలపాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుక్మిద్దీన్, మండల వ్యవసాయ అధికారి సందీప్, సర్వేయర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment