సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
అర్వపల్లి: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై గురువారం నుంచి ఈ నెల 20వరకు తలపెట్టిన సర్వేను వివిధ శాఖల సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని డీఏఓ, మండల ప్రత్యేక అధికారి శ్రీధర్‌రెడ్డి కోరారు. సర్వేకు సంబంధించి వివిధ శాఖల సిబ్బందితో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సర్వే కోసం గ్రామాల వారీగా టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఎంపీఓ గోపి, ఏఓ గణేష్, ఏఈఓలు శోభారాణి, సత్యం, సీనియర్ అసిస్టెంట్ ఆర్.జలెంధర్‌రావ్, జూనియర్ అసిస్టెంట్‌లు సరిత, మల్లీశ్వరి, ఆసియా, సర్వేయర్ వెంకటేశ్వర్లు, రికార్డు అసిస్టెంట్‌లు రమేష్, శ్రీకాంత్, శివ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment