పారదర్శకంగా నిర్వహించాలి
నాగారం: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల విచారణపై నిర్వహించనున్న గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ, నాగారం మండల ప్రత్యేక అధికారి అశోక్ సూచించారు. బుధవారం నాగారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో సంక్షేమ పథకాల విచారణపై రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు పథకాల విచారణపై గ్రామ సభలను నిర్వహించాలని సూచించారు. అధికారులకు గ్రామ సభల్లో లబ్ధిదారులు తమ పూర్తి స్థాయి సమాచారం తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వి.బ్రహ్మయ్య, ఎంపీడీఓ కె.మారయ్య, ఏఓ కృష్ణకాంత్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment