పీహెచ్‌సీల్లో సమయపాలన పాటించాలి
సూర్యాపేటటౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరినగర్‌లోగల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన వారిని ఆరా తీశారు. వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివ ప్రసాద్ సెలవు పత్రం లేకుండా విధులకు గైర్హాజరుకావడం.. శివప్రసాద్.. డాక్టర్ శశాంక్‌ను విధుల్లో ఉంచి వెళ్లడం ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకపోవడంతో డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ శివప్రసాద్‌కు మెమో జారీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment