తెలుగు భాషను మరువరాదు
● తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణలో
గుడిమెట్ల చెన్నయ్య
కొరుక్కుపేట: తెలుగు భాషను మరువరాదని జనని సంస్థ ప్రదాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పిలుపునిచ్చారు .ఈ మేరకు 2025 నూతన సంవత్సరం సందర్భంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘము (టీటీసీఏ) ఆధ్వర్యంలో నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఘ నంగా జరిగింది. సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుడిమెట్ల చెన్నయ్య పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణ, వికాసానికి ఈ సంఘం చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. దాదాపు 50 ఏళ్లగా తెలుగు సాహితీ సేవలో పయనిస్తూ తెలుగు వారికి విస్తృతంగా చేస్తుందని నిర్వాహకుల సేవలను ప్రశంసించారు. తెలుగు భాషను మరువరాదని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. సంఘము అధ్యక్షులు గత 48 ఏళ్లుగా క్రమం తప్పకుండా తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తూ నగరంలోని తెలుగు వారందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే కార్యదర్శి పీఆర్ కేశవులు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం చేస్తున్న సేవలను సభలో వివరించారు. గాయని వసుంధరాదేవి, తెలుగు భాషాభిమాని విజయ సారథి, సభ్యులకు తెలుగు క్యాలెండర్‌లను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment