సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం ఇందిరా పార్క్ సమీపం గల ఎమరాల్డ్ స్వీట్స్ షాప్‌లో జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేశారు. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్‌లో ఉన్న దారుణమైన పరిస్థితులను అధికారులు గుర్తించారు.
కంపు కొడుతూ దుర్గంధ భరితమైన వాతావరణంలో స్వీట్ల తయారు చేస్తున్నారు. రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్‌ను అధికారలు సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
శాంపిల్స్ సీజ్ చేసిన ల్యాబ్‌కు తరలించారు. స్విట్ కిచెన్‌లో అపరిశుభ్రతపై అధికారలు నోటీసులు ఇచ్చారు. కిచెన్‌లో ఎలుకలు, పందికొక్కులు తిరగటంపై ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment