భర్తే కారకుడంటూ బంధువుల ఆందోళన
హత్య చేశాడని ఆరోపిస్తూ.. పోలీస్టేషన్ వద్దే అతడిపై దాడి
లింగోజిగూడ: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వివాహిత బంధువులు పోలీస్టేషన్ ముందు ఆందోళన చేపట్టడంతో పాటు భర్తపై దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండలం కురుమిద్దెకు చెందిన రమావత్ సుజాత(21)కు గతేడాది నల్లగొండ జిల్లా చితంపల్లి మండలం గాశిరాం తాండకు చెందిన రమావత్ శివతో వివాహం జరిగింది. వీరు హయత్‌నగర్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్నారు. శివ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
వీరికి ఆరునెలల పాప ఉంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుజాత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బంధువుల ఆందోళన...
కాగా సుజాత ఆత్మహత్య చేసుకోలేదని, శివనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకకరించారని ఆరోపిస్తూ బుధవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ ముందు సుజాత బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సుజాత వివాహం సమయంలో ఇచి్చన కట్నం, బంగారం తిరిగి ఇవ్వాలని శివ బంధువులతో గొడవకు దిగారు. దీంతో పోలీస్టేషన్ ఆవరణలో డబ్బును తిరిగి ఇస్తామని శివ కుటుంబ సభ్యులు ఒప్పందానికి వచ్చారు. ఈ సమయంలో స్టేషన్‌కు వచ్చిన శివపై సుజాత బంధువులు దాడి చేశారు. గమనించిన పోలీసులు వారిని ఆపడానికి ప్రయతి్నంచగా తోపు లాట జరిగింది. ఇద్దరు మహిళా పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment