సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని ఓ గ్రామంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గోర్ట గ్రామంలో జరిగిన విముక్త పోరాటంలో 200 మంది గ్రామస్తులు మరణించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 75వ హైదరాబాద్ స్టేట్ విలీన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలను అమిత్ షా ఆవిష్కరిస్తారు.
తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ùకు శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సంజయ్ స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment