హైదరాబాద్: అత్తాపూర్‌లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 130 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్‌కు చెందిన హారిక అనే యువతి ఆఫీసుకు వెళ్లటానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడుతుంది. దీంతో తడవకుండా ఉండేందుకు ఫ్లై ఓవర్ కింద నిల్చుంచి.
సరిగ్గా ఈ సమయంలోనే అటుగా వస్తున్న స్కూల్ బస్సు.. హారికను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హారిక కొద్ది దూరం ఎగిరి పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళి పోయిన హారికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హారిక ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. హారిక ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిపారు బంధువులు.
Comments
Please login to add a commentAdd a comment