అమ్మా ప్రసన్నా.. లే అమ్మా! | Young Woman Died In Panjagutta Road Incident | Sakshi
Sakshi News home page

కన్నతండ్రి కళ్ల ముందే.. కబళించిన మృత్యువు

Published Tue, Aug 27 2024 7:28 AM | Last Updated on Tue, Aug 27 2024 7:35 AM

Young Woman Died In Panjagutta Road Incident

రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే కూతురి దుర్మరణం

పంజగుట్ట: తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపించేందుకు తోడుగా వచ్చిన కూతురు..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే దుర్మరణం పాలైన హృదయ విదారక సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చెంగిచెర్లకు చెందిన మేడా శంకర్‌రావు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.

ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సోమవారం సోమాజిగూడలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఆసుపత్రిలో ఎండోస్కోపీ చేయించుకునేందుకు శంకర్‌రావు తన కూతురు ప్రసన్న(25)ను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. ఉదయం 7:45 ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కూడలి వద్దకు చేరుకోగా వీరి బైకును వెనకనుండి అతివేగంగా వచి్చన టెంపో ఢీకొట్టింది. దీంతో శంకర్‌రావు, ప్రసన్న ఇద్దరూ కిందపడిపోయారు. 

శంకర్‌రావుకు హెల్మెట్‌ ఉండడంతో స్వల్పగాయాలతో బయట పడగా..ప్రసన్న కిందపడగానే తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మృతిచెందడంతో శంకర్‌రావు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి కారణమైన మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన టెంపో డ్రైవర్‌ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement