4 వికెట్లు తీసిన ప్రకాష్
వెంకటగిరి రూరల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తారకరామ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న సౌత్‌జోన్ అండర్–16 క్రికెట్ పోటీల్లో భాగంగా సోమవారం అనంతపురం–చిత్తూరు, కడప–నెల్లూరు జట్ల మధ్య క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. గ్రౌండ్–1లో అనంతపురం– చిత్తూరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 40.4 ఓవర్లకు 138 పరుగులు చేసింది. ఈ జట్టులో భువనేశ్వర్ 31 పరుగులు తీయగా చిత్తూరు జట్టు మౌలింగ్‌లో ప్రకాష్ 4, సోహాన్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లకు 133 పరుగులు తీసింది. ఈ జట్టులో నవీన్‌ధీర్ 58, ప్రసాద్ 45 పరుగులు తీసి నాటౌట్‌గా నిలిచారు. అనంతపురం జట్టుకన్నా చిత్తూరు జట్టు 5 పరుగుల తేడాలో వెనుకంజలో ఉంది.
గ్రౌండ్–2లో...
కడప–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కడప జట్టు 50 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ జట్టులో గురువిఘేష్ 66, నాగ కొల్లప్పా 35 పరుగులు తీశారు. నెల్లూరు జట్టు బౌలింగ్ విభాగంలో హరివరణ్ 6 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 43 ఓవర్లకు 125 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. ఈ జట్టులో ప్రసాద్ 64, విష్ణువిశాల్ 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. కడప జట్టుకంటే నెల్లూరు జట్టు 54 పరుగులు తేడాతో వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌ల కో–స్కోరర్‌గా సీడీ శ్రీనివాసులరెడ్డి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment