![సంక్షేమ పథకాలు వివరిస్తున్న నేదురుమల్లి - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/20/19vgr41-410005_mr_0.jpg.webp?itok=LiO8Mx3X)
సంక్షేమ పథకాలు వివరిస్తున్న నేదురుమల్లి
వెంకటగిరి రూరల్: జగనన్న కాలనీలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఆనం రామనారాయణరెడ్డి అని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని 5వ కాలేజీ మిట్టలో ఆ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు గతంలో లాటరీ ద్వారా ఇళ్లప్లాట్ నంబర్లు కేటాయించారుగానీ పట్టాలు ఇవ్వలేదన్నారు. స్పందించిన నేదురుమల్లి వెంకటగిరి ప్రజల ఓట్లతో నెగ్గిన ఆనం వారిని నిట్టనిలువునా ముంచేశారని తెలిపారు. వార్డు కౌన్సిలర్ నారి శేఖర్, పట్టణ కన్వీనర్ ఢిల్లీబాబు, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, విబ్ పూజారి లక్ష్మి, న్యాయవాది ఎల్.కోటేశ్వరరావు, చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్లు కళ్యాణి, శ్రీనివాసులు, సుబ్బారావు, నాయకులు గణేష్‌రెడ్డి, మల్లిరెడ్డి, చిన్నా, గిరీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment