రామచంద్ర పుష్కరిణి వద్ద టోకెన్ కేంద్రం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల కోసం టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు మహిమాన్విత మార్గం సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందస్తుగా టోకెన్లు జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో టికెట్ల కోసం వేచి ఉండే భక్తకోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి , ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment