30న కక్ష్యపైకి స్వేచ్ఛశాట్ ఉపగ్రహం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ60లో భాగంగా పీఎస్–4 ఆర్బిటల్ ఎక్స్‌పరమెంటల్ మాడ్యూల్‌లో స్వేచ్ఛశాట్ అనే ఓ బుల్లి ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఈ ప్రయోగంలో తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ భాగస్వామ్యం కానుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొత్తమాను సాయిదివ్య ఎన్ స్పేస్ టెక్ వ్యవస్థాపకురాలిగా ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేసుకుని ఇస్రో సహకారంతో ప్రయోగించనుంది. తమ ఉపగ్రహం కక్ష్యలోకి చేరాక ఇస్రోకు సంకేతాలు పంపితే తమ ప్రయత్నం ఫలించినట్టేనని ఆమె చెబుతోంది. స్వేచ్ఛశాట్ విజయవంతమైతే వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment