సంగీతం అంటే ప్రాణం
నేను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఏఈగా పనిచేస్తున్నాను. సంగీతం అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి కళారంగంలో రాణించాలనే కోరిక ఉండేది. ప్రధానంగా ‘వోకల్ ’ నేర్చుకోవాలనే తపన ఉండేది. విద్యార్థి దశలో అది కుదరలేదు. ప్రస్తుతం 59 ఏళ్ల వయసులో ఈ అవకాశం దొరికింది. ఎస్వీ మ్యూజిక్ కళాళాశాలలో ఈవినింగ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉండడంతో గత రెండేళ్లుగా వోకల్ నేర్చుకుంటున్నాను. కుటుంబ బాధ్యతలు ఉన్నా నా అభిరుచిని నెరవేర్చుకోవాలనే పట్టుదలదో ప్రతి రోజూ తరగతులకు హాజరువుతన్నాను. సంగీతం నేర్చుకోవడం వల్ల ఒత్తిడి, మానసికరుగ్మతలు దరిచేరవు. భక్తిభావంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది.
–టీ.కనక సత్యసాయికుమార్, ఏఈ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment