No Headline
నేటి ఆధునిక యుగంలో
ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం
ఉద్యోగులు, గృహిణులు వినూత్న
ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ మ్యూజిక్
కళాశాలలో నిర్వహిస్తున్న ఈవెనింగ్ కోర్సులకు క్యూ కడుతున్నారు. జిల్లాలోని నలుమూలల
నుంచి సుమారు 600 మందికి పైగా ఇక్కడ శిక్షణ
పొందుతున్నారు. వయోలిన్, ఫ్లూట్, వోకల్,
భరతనాట్యం, కూచిపూడి, హరికథ, తబలా,
మృదంగం, వీణ, నాదస్వరం, డోలు వంటి
విభాగాలలో పార్ట్‌టైమ్ కోర్సుల్లో చేరి శాసీ్త్రయ
సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. వారి ఆసక్తి,
అభిరుచిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– తిరుపతి సిటీ
సంగీతం కోసం
పార్ట్‌టైమ్ కోర్సుల్లో
చేరుతున్న ఉద్యోగులు
వయోబేధాలు మరిచి
వీణ, వయోలిన్,
మృదంగం, ఫ్లూట్,
వోకల్‌వైపు మొగ్గు
ఎస్వీయూ మ్యూజిక్ కళాశాలకు క్యూ
కడుతున్న
గృహిణులు
నేను ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్. చిన్నతనం నుంచి వయోలిన్ అంటే నాకు పిచ్చి. ఉద్యోగంలో చేరిన వెంటనే మ్యూజిక్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ పొందాను. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారు సైతం కళాశాలలో సంగీతం నేర్చుకోవడం మాలాంటి వారికి ప్రేరణ కలిగిస్తోంది. వయోలిన్‌లో మంచి ప్రావీణ్యం సాధించాలని కృషి చేస్తున్నా.
–కే.లిఖిత, లెక్చరర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment