సర్పంచ్‌పై మేట్ దాడి
చింతగుంట సర్పంచ్ చెంచు ప్రసన్న కుమార్‌పై ఉపాధి హామీ మేట్ కారంపూడి కోటేశ్వరరావు దాడి చేశారు.
శ్రీవారి రథోత్సవానికి
సర్వం సిద్ధం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. తేరును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు రథంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఇప్పటికే టీటీడీ ఇంజినీర్లు రథచక్రాలు పరీక్షించి అన్నీ సవ్యంగా ఉన్నాయని తేల్చారు. అనంతరం రాత్రికి స్వామివారు అశ్వవాహనంపై విహరించనున్నారు. పెద్దజీయర్ స్వామి, చినజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టెంపుల్ డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.
చక్రస్నానం నిర్వహణకు
పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు శనివారం ఉ దయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చే సింది. ఇప్పటికే కొత్త నీటిని నింపి, వందశాతం క్లోరినేషన్‌న్ చేశారు. ప్రత్యేకంగా ఇనుప చైన్ లింక్ కంచెలు నిర్మించారు. వరాహస్వామి ఆల యం వద్ద పుష్కరిణిలో సుదర్శన చక్రతాళ్వార్‌కు పుణ్యస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక చక్రస్నానం చేసే ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు.
– IIలో
Comments
Please login to add a commentAdd a comment