దుకాణదారులకు ఇబ్బందే
మొబైల్ ఫోన్‌కు మాదిరిగా ఎంత రీచార్జి చేసుకుంటే అంతవరకే కరెంట్ ఇవ్వడం, ఆపై కట్ చేయడం చేస్తే ఎవరికై నా ఇబ్బందే కదా. ఒక్కొక్క నెలలో దుకాణంలో వ్యాపారం తగ్గుముఖం పడితే డబ్బులున్నప్పుడు పెనాల్టీ కట్టి అయినా కరెంట్ బిల్లు కట్టే వెసలుబాటుంటుంది. కానీ ఇప్పుడు ముందుగానే కట్టాలంటే కుదిరేపనేనా.?
– సుభాన్, హోటల్ యజమాని, పలమనేరు
అన్ని కేటగిరిలకు
స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌మీటర్లను అమర్చుతున్నాం. వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు ఏర్పాటు చేస్తాం. ఆపై గృహాలు, మళ్లీ రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేస్తాం. ముందుగానే డబ్బు చెల్లించడంతో పెండింగ్ బకాయిల సమస్య తగ్గుతుంది.
– శ్రీనివాసమూర్తి, డీఈ,
ట్రాన్స్‌కో, పుంగనూరు
Comments
Please login to add a commentAdd a comment