స్థానికులకు దర్శన టోకెన్ల జారీ
తిరుమల: గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసిన మేరకు సోమవారం తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులుతో కలిసి తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. స్థానికులకు కొన్ని టోకెన్లు జారీ చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ.. కొన్నేళ్ల తర్వాత స్థానికులకు దర్శనాన్ని పునరుద్ధరించేందుకు బోర్డు తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకుందని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం అడిషనల్ ఈవో మాట్లాడుతూ తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు దర్శన కోటా ఖరారు చేసేందుకు టీటీడీ అధికారులు కసరత్తు చేశారన్నారు. టెంపుల్ డెప్యూటీఓ లోకనాథం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment