పోలీస్ గ్రీవెన్స్‌కు 48 ఫిర్యాదులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు వెలువెత్తినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 48 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఇతర ఫిర్యాదులు అందినట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 67,496 మంది స్వామివారిని దర్శించుకోగా 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment