కొట్టుకుపోయిన పెట్టుబడి
ఒక ఎకరం వరి పంటను సాగుచేయడానికి దాదాపు రూ.20 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. దున్నకాలు.. నాట్లు.. పురుగు మందులు.. ఎరువులు.. కోతల వరకు పెట్టుబడి పెట్టాల్సిందే. ప్రస్తుతం ఎరువుల ధరలు పెరగడంతో ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.5వేలు వరకు ఖర్చుచేసినట్టు రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లో వరిపంట సాగుచేయగా.. ఎరువుల కోసమే రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. నాట్లు వేసిన రెండు మూడు రోజులకే వర్షాలు రావడంతో అంతా కొట్టుకుపోయిందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడికి కూటమి ప్రభుత్వం రూ.20వేలు ఇస్తామని ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment