పూర్తిగా మునిగిపోయింది
నేను 20 రోజుల క్రితం మూడు ఎకరాల కౌలు భూమిలో వరి పంట సాగుచేశా. పంట పెట్టుబడి రూ.60వేలు అయ్యింది. వర్షాలతో నా పంట పూర్తిగా మునిగిపోయింది. నీళ్లెప్పుడు తగ్గుతాయో తెలియదు. వేసిన ఎరువులు కూడా కొట్టుకుపోయాయి. మళ్లీ ఎరువులు వేయడానికి నాకు శక్తి లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నా.
– లక్ష్మీపతి, రైతు సంతవేలూరు గ్రామం
నాలుగు ఎకరాల్లో మునక
నేను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశా. పంట మొత్తం మునిగిపోయింది. మూడు రోజులుగా నీటిలోనే నాని పాచిపోతోంది. ఎరువుల కోసమే రూ.12 వేలకు పైగా ఖర్చుచేశా. నీటి ప్రవాహంతో ఆ మందంతా కొట్టుకుపోయింది. మళ్లీ పెట్టుబడి పెట్టాలంటే మళ్లీ అప్పులు చేయాల్సిందే. ప్రభుత్వమే ఆదుకోవాలి.–వెంకటేశ్వర్లు, సూళ్లూరు గ్రామం, రైతు
11వేల ఎకరాల్లో వరి మునక
జిల్లాలో ఇప్పటికే లక్ష ఎకరాల మేరకు వరి పంట సాగుచేశారు. డిసెంబర్ 31 వరకు వరి పంట సాగుచేస్తూనే ఉంటారు. తుపాన్ ప్రభావంతో 11వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. మళ్లీ వర్షాలు లేకుంటే ఆ పంటకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. వర్షాలు వస్తే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వేరుశనగ, మినుము, పెసర పంటలకు సంబంధించి నష్టాలపై విచారణ చేస్తున్నాం.
–ఎస్.ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●
Comments
Please login to add a commentAdd a comment