గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
సూళ్లూరుపేట: గడువు లోపు అన్ని శాఖల అధికారులు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీసత్యసాయి కల్యాణ మండపంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పట్ల కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇవ్వాలంటే రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు. దాంతో పాటు వ్యయ ప్రయాసలకోర్చి రావాల్సి ఉంటుందన్నారు. వారి ఇబ్బందిని గమనించి ప్రజల సౌకర్యార్థం ప్రజల వద్దకే అధికార యంత్రాంగమంతా కూడా వచ్చి అర్జీలు స్వీకరించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రెండు వారాలకు ఒకసారి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మొత్తం 164 అర్జీలు దాకా వచ్చాయని తెలిపారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై 104 అర్జీలు ఉన్నట్టు వెల్లడించారు. ఆర్డీఓ ఈతమాకులు కిరణ్మయియాదవ్, ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో..
తిరుపతి అర్బన్: గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలని జేసీ శుభం బన్సల్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ జిల్లా నలుమూలల నుంచి మొత్తం 82 అర్జీలు వచ్చినట్టు వెల్లడించారు. ఇందులో 53 అర్జీలు రెవెన్యూ సమస్యలకు చెందినవేనన్నారు. డీఆర్వో నరసింహులతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment