శోభాయాత్ర
తిరుమల/చంద్రగిరి : పున్నమి గరుడసేవలో శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారం శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. 15 ఏళ్లకు పైగా గజవాహన సేవలో ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం ఆధ్వర్యంలో హారాన్ని తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు ఆధ్వర్యంలో తిరువీధుల్లో శోభాయాత్రగా ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి మూలవర్లకు అలంకరించారు. రాత్రి గజవాహన సేవలో లక్ష్మీకాసుల హారాన్ని ధరించి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. అలాగే మంగళవారం నిర్వహించే గరుడ వాహన సేవలోనూ హారాన్ని ధరించనున్నట్టు టీటీడీ చైర్మన్ తెలిపారు. అంతకుముందు లక్ష్మీకాసుల హారాన్ని తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో తిరుచానూరుకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment