పట్టాభిరామునిగా పద్మావతీదేవి
● కనులపండువగా ‘హనుమ’ సేవ ● కల్పవృక్ష వాహనంపై విహరించిన సిరులతల్లి
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి 8గంటలకు అమ్మవారు హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకరణలో దర్శనమిచ్చారు. మాడవీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించా. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఉదయం 4గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. రాజమన్నార్ అలంకరణలో చర్నాకోలు, దండం ధరించిన పద్మావతీదేవి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తుల గోవింద నామ స్మరణ నడుమ కనులపండువగా ఊరేగింపు సాగింది. మధ్యాహ్నం అమ్మవారికి వేడుకగా స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ జరిపించారు. రాత్రి హనుమంత వాహనంపై అమ్మవారు విహరించారు. సేవల్లో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈఓ శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజు, అర్చకుడు బాబుస్వామి పాల్గొన్నారు.
నేడు పద్మశాలీల పట్టువస్త్రాలు
అమ్మవారికి గజ వాహన సేవ సందర్భంగా పద్మశాలీలు పట్టువస్త్రాలు, పుట్టింటి సారె సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా సోమ వారం మధ్యాహ్నం జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను ఆలయ అధికారులకు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment