గురుకులంలో ఆకలి కేకలు
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆదివారం మధా్‌య్‌హ్న భోజనం ఆలస్యంగా పెట్టడంపై తహసీల్దార్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ సుబ్రమణ్యం వెంటనే గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆలస్యంగా భోజనం వడ్డించడంపై ప్రిన్సిపల్, వార్డెన్‌ను ప్రశ్నించారు. ప్రిన్సిపల్ ధర్మేంద్రసింగ్ మాట్లాడుతూ.. భోజనం ఆలస్యంగా పెట్టడం వాస్తవమే అన్నారు. అదే సమయానికి బియ్యం లోడు రావడంతో వంట మనుషులే కూలీలుగా మారి బస్తాలను దించుకుని, తర్వాత భోజనం తయారు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేసేందుకు కూలీలు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. మరో పర్యాయం ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment