No Headline
ఫెంగల్ తుపాను జిల్లాను అతలాకుతలం చేస్తోంది. మూడు రోజుల నుంచి వదలకుండా వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో జనజీవనం దాదాపు స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో కొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
నదులు.. వాగులు.. వంకల ఉధృత ప్రవాహం పరీవాహక ప్రాంతాలను వణికిస్తోంది. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రజానీకం కోరుతోంది. ఈ క్రమంలోనే జలాశయాలు.. చెరువులకు భారీగా వరద నీరు చేరుతుండడం కొంతలో కొంత ఉపశమనమని వెల్లడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment