నేడు ‘కాసుల హారం’ శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు ‘కాసుల హారం’ శోభాయాత్ర

Published Mon, Dec 2 2024 1:33 AM | Last Updated on Mon, Dec 2 2024 1:33 AM

-

చంద్రగిరి/తిరుమల : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం రాత్రి అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీ కాసుల హారాన్ని గజ వాహనంపై కొలువుదీరిన అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా సోమవారం తిరుమల నుంచి సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని శోభాయాత్రగా తీసుకువచ్చి ఆలయ అధికారులు, అర్చకులకు అందజేయనున్నారు. ఈ క్రమంలోనే గజవాహన సేవ అనంతరం సిరులతల్లికి వసంతోత్సవం నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement