పోటాపోటీగా అంతర్ కళాశాలల టీచింగ్ స్టాఫ్ టోర్నమెంట్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ అంతర్ కళాశాలల టోర్నమెంట్ సోమవారం వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పోటాపోటీగా జరిగింది. ఇందులో చెస్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్‌లో పురుషులు, మహిళల విభాగాల్లోని పోటీలకు పలు కళాశాలల నుంచి అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన అధ్యాపకులకు వర్సిటీ రిజిస్ట్రార్ భూపతినాయుడు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బీవీ మురళీధర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment