ఉత్తమ బోధన అందించాలి
తిరుపతి సిటీ: విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని వీసీ జీఎస్‌ఆర్.కృష్ణమూర్తి తెలిపారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. ఎగ్జిబిషన్‌లో బీఈడీ విద్యార్థులు ప్రదర్శించిన పలు పాఠ్యాంశాలకు సంబంధించిన ఆకృతులు ఆకట్టుకున్నాయన్నారు. రిజిస్ట్రార్ రమాశ్రీ, అధ్యాపకులు కాదాంబిని, వెంకటరావు, దక్షిణమూర్తి శర్మ, మురళీధరరావు, కనపాల కుమార్, సునీత, వైష్ణవి, చారుకేష్, లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment