ఉపాధ్యాయునికి తప్పిన ప్రమాదం
రేణిగుంట(ఏర్పేడు): స్కూల్‌కు బైక్ పై వెళుతూ ఉధ్రుతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో ఓ ఉపాధ్యాయుడు జారిపడ్డాడు. కొంత దూరం వరకు కొట్టుకుపోగా స్థానికులు గుర్తించి రక్షించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. ఏర్పేడు మండలం, రాజులకండ్రిగ ప్రాథమిక పాఠశాలలో రత్నకుమార్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై స్కూల్‌కి బయలుదేరాడు. పాపానాయుడుపేట –శ్రీకాళహస్తి మార్గం గోవిందవరం కాజ్‌వేపై వాగు దాటుతున్న క్రమంలో జారి నీటిలో బైక్‌తో సహా పడిపోయాడు. స్థానికులు వాగు నీటిలోకి దూకి తాళ్ల సాయంతో అతన్ని బైక్‌తో సహా ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలను కాపాడిన స్థానిక యువకులకు ఉపాధ్యాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment