సైబర్ సెక్యూరిటీపై అవగాహన
తిరుపతి సిటీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ), ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీనివాస ఆడిటోరియంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఐల్ నరసింహారావు ప్రధాన వక్తగా విచ్చేసి స్మార్ట్ ఫోన్ల భద్రత, వాట్సాప్ వినియోగం, ఇమేజెస్, ఇతర యాప్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రొఫెసర్ బీవీ మురళీధర్, ఐఐపీఏ చైర్మన్ ప్రొఫెసర్ టీ.లక్ష్మమ్మ, కార్యదర్శి ప్రొఫెసర్ డీ.కృష్ణమూర్తి, డాక్టర్ కల్యాణ్, ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్, డాక్టర్ పీ.వివేక్ పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment