పార్టీ జిల్లా కార్యాలయం పరిశీలన
తిరుపతి మంగళం : రేణిగుంట విమానాశ్రయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణ పనులను శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోట రాజేష్ పరిశీలించారు. నూతన పార్టీ కార్యాలయ పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే పార్టీ కార్యకలాపాలను జిల్లా కార్యాలయం నుంచి కొనసాగిస్తామని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, బీరేంద్రవర్మ, తలారి రాజేంద్ర, బొమ్మగుంట రవి, శేఖర్రాయల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment