షార్ గ్రూప్ డైరెక్టర్‌కు పదోన్నతి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట రాకెట్ కేంద్రం షార్‌కు గ్రూప్ డైరెక్టర్ (మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ఏరియా)గా పనిచేస్తున్న గోపీకృష్ణకు డిప్యూటీ డైరెక్టర్ (మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ఏరియా)గా పదోన్నతిని కల్పిస్తున్నట్టు భారత అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం బెంగళూరు నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఆయన శనివారం కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, షార్ కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డితో పాటు సహోద్యోగులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అభినందనలు తెలియజేశారు.
లైంగిక దాడి కేసులో
నిందితుడి అరెస్ట్
చిట్టమూరు(చిల్లకూరు): చిట్టమూరు మండలంలోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడ్ని చిట్టమూరు పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు గూడూరు డీఎస్పీ వీవీ రమణకుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డిశెంబర్ 31వ తేదీన మూడేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో ఈశ్వరవాకకు చెందిన పెనిమిటీ శీనయ్య(50) పాపను బలవంతంగా ఇంట్లోకి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. శుక్రవారం ఈశ్వరవాకకు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment