తాగుబోతుల వీరంగం
శ్రీకాళహస్తి: దేవస్థానానికి చెందిన వరదరాజస్వామి ఆలయ అతిథి గృహంలో కొందరు యువకులు శనివారం మద్యం సేవించి వీరంగం సృష్టించారు. అక్కడి సిబ్బంది వారిని ప్రశ్నిస్తే తాను అతిథి గృహం ఉద్యోగి కొడుకు అని.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ సమాధానం చెప్పినట్టు తెలిసింది. దీంతో సిబ్బంది ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు అతిథి గృహంలో విధుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాధవరెడ్డి, ఒప్పంద ఉద్యోగి లక్ష్మణరెడ్డిని విధులు నుంచి నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. గతంలో ఓ సెక్యూరిటీ ఉద్యోగి శివగోపురం పక్కన మద్యం, మాంసం సేవించిన వీడియో వైరల్ మారింది.
Comments
Please login to add a commentAdd a comment