తిరుపతి మంగళం : శేషాచలం అటవీ ప్రాంతంలో 12 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లర్‌ను శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీలు జీ. బాలిరెడ్డి, వీ.శ్రీనివాసరెడ్డి, ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఐ విష్ణువర్ధన్ కుమార్ టీమ్ శుక్రవారం రాత్రి తిరుమల శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టినట్టు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి తచ్చాడుతూ కనిపించాడని, అతను పారిపోయే ప్ర యత్నం చేయగా పట్టుకుని, విచారించినట్టు వెల్ల డించారు. దాంతో ఒక డంప్‌లో దాచి ఉంచిన 12 ఎరచ్రందనం దుంగలు చూపించాడన్నారు. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి గా గుర్తించి అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment