ఘనంగా బ్రెయిలీ దినోత్సవం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని ఎంజీఎం పాఠశాల ఆవరణలో శనివారం ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెయిలీ దినత్సోవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి డీవైఈఓ బాలాజీ పాల్గొని మాట్లాడారు. తర్వాత భవిత కేంద్రంలోని విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాకురాలు తహసున్నీసాబేగం, ఎంజీఎం హైస్కూల్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మునిశారద, భానుమతి పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా తవిత తులసి
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ తవిత తులసికి సావిత్రీబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. భారతీయ చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా సావిత్రీ బాయి పూలే జయింతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాండేలే, సినీ నటి రేణు దేశాయ్, హాస్య నటుడు బ్రహ్మానందం ముఖ్యఅతిథులుగా విచ్చేసి అవార్డులను అందజేశారు. మహిళా వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజినీ ఆమెన అభినందించారు.
హథీరాంజీ మఠం ఇన్‌చార్జ్‌గా బాపిరెడ్డి
తిరుపతి కల్చరల్: శ్రీస్వామి హథీరాంజీ మఠం ఇన్‌చార్జ్ పాలనాధికారిగా శ్రీకాళహస్తి ఈవో, డెప్యూటీ కలెక్టర్ టీ.బాపిరెడ్డి నియమితులయ్యారు. గతంలో ఇన్‌చార్జ్ పాలనాధికారిగా పనిచేసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో కేఎస్.రామారావు పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో 2004 డిసెంబర్ 31న రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ శ్రీకాళహస్తి ఈఓను హథీరాంజీ మఠం ఇన్‌చార్జ్ పరిపాలనాధికారిగా నియమించారు. ఈమేరకు శనివారం డెప్యూటీ కలెక్టర్ బాపిరెడ్డి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠంలో బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment