నూతన కమిటీ ఎంపిక
తిరుపతి కల్చరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈమేరకు ఆదివారం యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నెల్లూరు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఏ.నరసింహులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా టి.నరసింహులు, కార్యదర్శిగా ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కే.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కె.నరసింహ, కోశాధికారిగా డాక్టర్ మన్యం నరసింహులు నియమితులయ్యారు. నూతన కమిటీని రాష్ట్ర సంఘం సలహాదారుడు తమటం రామచంద్రారెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.రవి, ఇతర అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment