గుడిమల్లం ఆలయ పరిశీలన
రేణిగుంట(ఏర్పేడు): ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరాలయాన్ని ఆదివారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపురాతన శైవక్షేత్రమైన ఈ ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నట్లు పురావస్తుశాఖ సౌత్‌జోన్ రీజనల్ డైరెక్టర్ ఎన్‌కే పతాక్ తెలిపారు. ఆలయ ప్రతిష్ట, ప్రాశస్త్యం భక్తులకు మరింత చేరువయ్యే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ రామచంద్రారెడ్డి వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శాలువాలతో సత్కరించారు. సూపరింటెండెంట్ గోపీనాథ్, సీఐ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన అన్ని విభాగాల అధికారులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో జిల్లావాసులు వారి సమస్యలను తెలియజేయడానికి చక్కటి అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోగలరని అధికారులు తెలిపారు.
నేటి నుంచి
క్రీడా సాంస్కృతిక పోటీలు
తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ కళాశాల వేదికగా సోమవారం నుంచి ఈ నెల 10వతేదీ వరకు వెటర్నరీ వర్సిటీ అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ జగపతిరామయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వెటర్నరీ, ఒక డెయిరీ కాళాశాల నుంచి సుమారు 490మంది విద్యార్థులు వివిధ విభాగాలలో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని తెలియజేశారు. ఐదురోజుల పాటు జరిగే ఈ పోటీలకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రారంభ కార్యక్రమానికి టీటీడీ విజిలెన్స్ అధికారితో పాటు వీసీ పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment