కియా సిరోస్‌ కారు ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కియా సిరోస్‌ కారు ఆవిష్కరణ

Published Sun, Jan 26 2025 6:10 AM | Last Updated on Sun, Jan 26 2025 6:10 AM

కియా సిరోస్‌ కారు ఆవిష్కరణ

కియా సిరోస్‌ కారు ఆవిష్కరణ

చంద్రగిరి: చైన్నె – బెంగళూరు రహదారి తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కియా కార్‌ షోరూంలో శనివారం సాయంత్రం కియా సిరోస్‌ నూతన కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీ.జగన్నాథరెడ్డి, డైరెక్టర్‌ చెరకు నిరంజన్‌, సీ.భారతి, సీ.హోషిమారెడ్డితో పాటు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. డీటీఓ మురళీమోహన్‌ చేతుల మీదుగా కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీ.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కియా సిరోస్‌ కారులో అత్యాధునిక సదుపాయాలున్నాయన్నారు. రోబస్ట్‌ 20 స్టాండర్డ్‌ సేఫ్టీ ప్యాక్‌, 2వ వరుసలోని సీట్లు రీసైక్లిన్‌, స్లైడ్‌ వెంటిలేషన్‌, డ్యూల్‌ పాన్‌ సన్‌రూఫ్‌, హార్మన్‌ కార్డన్‌ ప్రీమియంలో 8 స్పీకర్లలతో అత్యాధునిక మ్యూజిక్‌ సిస్టమ్‌, 30 ఇంచ్‌ల ట్రినిటీ డిస్ప్లేతో కారు నావిగేషన్‌, స్ట్రీమ్‌లైన్‌ డోర్‌ హ్యాండిల్స్‌ను అందించడం జరిగిందన్నారు. అదే విధంగా ఏడిఏఎస్‌ లెవల్‌ 2తో పాటు 16 అటానమస్‌ ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. 8 రంగులలో ఈ కారు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కారు బుకింగ్‌ కోసం 86888 29739 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం సీనియర్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement