వైద్యకళాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్
తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ పీఏ చంద్రశేఖరన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో తొలిసారి హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం, సామాజిక సేవలు, పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ డీఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ తెరిసా రాణి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ తుంగ శ్రీకాంత్, డిస్ట్రిక్ సెక్రెటరీ దయాకర్, డిస్ట్రిక్ ఆర్గనైజింగ్ కమిషనర్ వెంకట సుమంత్, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నవీన్, వైద్య కళాశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ కోఆర్డినేటర్ వర్మ, వైద్య విద్యార్థులు, పారా మెడికల్ విద్యార్థులు, పీఆర్‌ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు ఖాళీ గా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 57,665 మంది స్వామివారిని దర్శించుకోగా 20,051 మంది భక్తులు తలనీలాలు సమర్పించా రు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment